ఇబ్రహీంపట్నం: ఆల్విన్ కాలనీ డివిజన్లోని ఎల్లమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆల్విన్ కాలనీ డివిజన్లోని ఎల్లమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళా మృతదేహం కలకలం రేపిన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనను పరిశీలించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.