ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల, మరియు బాలుర ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలో మౌలిక వసతులు విద్యాబోధన మెరుగుపడిందన్నారు. యువ నాయకుడు మంత్రి లోకేష్ బాబు ఆలోచన విధానంతో విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు.