నారాయణపేట్: నారాయణపేటలో అర్ద నగ్న ప్రదర్శన నిర్వహించిన బిజెపి నాయకులు
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి మరియు చిన్నపిల్లల ఆసుపత్రిని ఇక్కడ నుండి గడ్డమీది అప్పంపల్లి వరకు తరలించారు.జిల్లా కేంద్రంలో ప్రథమ చికిత్స కోసం ఎలాంటి వైద్య సదుపాయాలు లేనందున మంగళవారము పళ్ళ వీధి నుండి పురవీధుల గుండా సరాఫ్ బజార్ సెంటర్ చౌక్ వీర సావర్కర్ చౌరస్తా నర్సిరెడ్డి చౌరస్తా వరకు బిజెపి నాయకులు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఎలాంటి ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రి లేనందున ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ఆస్పత్రి ఏర్పాట్లు చేసే వరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.