అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ముమ్మరంగా చేపట్టారు. వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి సిపి వీరన్న, బెలుగుప్ప మండలం జడ్పిటిసి మమతా త్రిలోక్ రెడ్డి, మండల కన్వీనర్ మచ్చన్న బీసీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ శ్రీనివాసులు నర్సాపురం ఎంపీటీసీ సురేష్ తదితరుల ఆధ్వర్యంలో గ్రామంలోని కాలనీలో ఇంటింటా తిరిగి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూల ప్రసాద్, పురుషోత్తం, కరుణాకర్, వెంకటేశులు, సుంకా నాయక్ తదితరులు పాల్గొన్నారు.