కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో 838 పొగాకు బేళ్లను కొనుగోలు చేసినట్లు వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ వెల్లడి.
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం 336 పొగాకు బేళ్లు కొనుగోలు చేయకుండా తిరస్కరించారు. మొత్తం 1174 పొగాకు బేళ్లు పలు గ్రామాల రైతులు అమ్మకానికి తీసుకురాగా 838 బేళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. కొండపి పొగాకు బోర్డు పరిధిలో రైతులు తెచ్చిన పొగాకు కొనుగోలు నేడు లాభసాటిగా సాగినట్లుగా వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ ప్రకటించారు.