మెగా డీఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పించిన కలెక్టర్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు
Ongole Urban, Prakasam | Sep 17, 2025
మెగా డీఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అమరావతి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఈనెల 19వ తేదీన నిర్వహించే నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వెళ్తున్న ఎంపికైన అభ్యర్థుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జి. సత్యనారాయణ, డీఈవో ఏ.కిరణ్ కుమార్ ఇందులో పాల్గొన్నారు.