అసిఫాబాద్: ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని బెజ్జూర్ జడ్పీటీసీ మాజీ సభ్యుడు పాల్వాయి సుధాకర్ రావు అన్నారు. బుధవారం సాయంత్రం సలగుపల్లి గ్రామపంచాయతీలో బీజేపీ నాయకులతో కలిసి ఇందిమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఇండ్ల నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయన్నారు. దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, దిలీప్ పాల్గొన్నారు.