ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలో సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఐ రామారావు పలు సూచనలు చేశారు. మొబైల్లలో అపరిచిత వ్యక్తుల మెసేజ్లను గాని లింకులను గాని ఓపెన్ చేయొద్దని సూచించారు. అదేవిధంగా ఓటిపి చెప్పడం గాని బ్యాంకు వివరాలను తెలియజేయడం గాని చేయకూడదని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.