జమ్మలమడుగు: చెన్నూరు : రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు మండలం చెన్నూరుకు చెందిన యువకుడు ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కడప నగర శివారులో బైక్ పై డ్రైవ్ చేస్తూ అదుపు తప్పి డివైడర్ ఢీ కొన్న ఘటనలో యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు చెన్నూరుకు చెందిన సూరిగా గుర్తించారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.