హిమాయత్ నగర్: సికింద్రాబాద్ పరిధిలో రోడ్డుపై ఒకసారిగా కుప్పకూలి వ్యక్తి మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సికింద్రాబాద్ పరిధిలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై సుమన్ అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు అప్పటికే గమనించగా అతడు మృతి చెందినట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సిసి ఫుటేజ్ ను పరిశీలించి అతడు గుండెపోటుతో కిందపడి మరణించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.