ఇబ్రహీంపట్నం: అత్తాపూర్ లోని అంబియన్స్ పోర్టులో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసిన జిహెచ్ఎంసి అధికారులు
అత్తాపూర్ లోని ఆంబియన్స్ పోటులో అనుమతులు లేకుండా నిర్మించిన అదనపు అంతస్తులు అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసి అధికారులు ఉక్కు పాదం మోపారు. ఈ సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య సోమవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.