అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత టిడిపి నేతలు అధికారులతో కలిసి రాప్తాడులో నూతనంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం నూతన ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ భవనాన్ని నిర్మించేందుకు పనులు ప్రారంభించడం జరిగిందని భవనం పూర్తి కావచ్చిందని త్వరలోనే ప్రారంభించి పేద ప్రజలకు ఐదు రూపాయలకే భోజనాన్ని అందిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.