శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో 17 18 వార్డులు పల్లి నగర్ లో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త దీపిక వైసిపి నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పండగలకు పబ్బాలకు మాత్రమే పర్యటిస్తారని ప్రజల సమస్యలను గాలికి వదిలేసారని హిందూపురంలో ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోవాలని కోరారు.