నారాయణపేట్: మాగనూరు మండలంలోని గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లోని మాగనూరు మండలం అడవి సత్యారం గ్రామ పంచాయతీలో గల వరి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. కేంద్రానికి ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం విక్రయానికి వచ్చిందని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సెంటర్లో గన్నీ బ్యాగుల ఎన్ని ఉన్నాయని కలెక్టర్ ప్రశ్నించగా 15 వేల బ్యాక్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు కలెక్టర్ కు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాగనూరు మండల పంచాయతీ పరిధిలోని పిఎసిఎస్ వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.