తాడేపల్లిగూడెం: స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి పోలీస్ ఐలాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. 7 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. పట్టణ స్వచ్ఛతకు కృషి చేస్తున్న కమిషనర్ ఏసుబాబును అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ తాతాజీ, మున్సిపల్, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.