కుప్పం: భార్య కాపురానికి రాలేదని కత్తితో దాడి
కుప్పం మండలంలోని బైరప్ప కొటాలకు చెందిన కీర్తి(18)కి రెండేళ్ల కిందట తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన రాజేష్‌తో వివాహమైంది. ఐదు నెలల కిందట డెలివరీ కోసం ఆమె పుట్టింటికి వచ్చి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టి నాలుగు నెలలు కావస్తున్నా భార్య కాపురానికి రాలేదని, తనతో సరిగ్గా మాట్లాడటం లేదని మనస్థాపనానికి గురైన రాజేష్ తన భార్య గొంతు కోసి, ముఖంపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.