మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరులో వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా బుధవారం కందుకూరులో జరగనున్న నిరసన కార్యక్రమంపై పార్టీ శ్రేణులతో చర్చించారు. అందుకోసం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా కార్యకర్తలు తరలి రావాలని బుర్రా పిలుపునిచ్చారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేయాలని కోరారు.