నారాయణపేట్: మద్దూరు లో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించిన ఎస్సై విజయకుమార్
నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణంలో ఎస్సై విజయకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలు వాహన పత్రాలు హెల్మెట్ వినియోగం మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని సూచిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై విజయకుమార్ మాట్లాడుతూ ప్రజల ప్రాణ భద్రత మనందరి బాధ్యత అని ఆటో డ్రైవర్లకు సూచించారు ఎల్లప్పుడూ వాహనాలను జాగ్రత్తగా నడపాలని చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని తెలిపారు ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను విద్యార్థులను కూలీలను ఎక్కించుకోరాదని సూచించారు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని చట్ట ఉల్లంఘనకు పాల్పడరాదని సూచించారు