గూడూరు పట్టణంలో పట్టపగలు భారీ దొంగతనం జరిగింది. మిట్టపాలెంలో నివాసం ఉంటున్న శారదమ్మ, మల్లికార్జున దంపతులు టీచర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ మంగళవారం విధులకు వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చి తాళం తీయబోయారు. వేరే తాళం ఉండడంతో అనుమానం వచ్చి ఇంటిని పరిశీలించారు. 19 సవర్ల బంగారు నగలు కనబడలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం బుధవారం బాధితుల ఇంటికి చేరుకుని పరిశీలించింది.