కోరుట్ల: మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో గ్రంథాల నిర్మాణం అసంపూర్తిగా ఉంది పూర్తయ్యదేన్నడు
మెట్పల్లి గ్రంథాలయం పూర్తయ్యేదెప్పుడు మెట్పల్లి మండలం బండలింగాపూర్లో గ్రంథాలయ భవన నిర్మాణం అసంపూర్తిగా ఉంది. ఆరేళ్ల క్రితం రూ.4 లక్షల నిధులు మంజూరవగా గోడలు, స్లాబ్ వరకు పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత నిధులు లేక పనులు మధ్యలో నిలిచిపోయాయి. పాలకుల నిర్లక్ష్యం వల్లే భవన నిర్మాణం అసంపూర్తిగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా భవనాన్ని పూర్తి చేసి, గ్రంథాలయంలో వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.