కనిగిరి: కొత్తగా వ్యాపారం ప్రారంభించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే మహిళలు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచించారు. కనిగిరి పట్టణంలోని ఆల్ఫా డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నైపుణ్య శిక్షణను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అందించే నైపుణ్య శిక్షణను మహిళలు, యువత సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.