గజపతినగరం: టీచర్లకు బోధనేతర పనులు రద్దు చేయాలి: గజపతినగరం లో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహన్ రావు డిమాండ్
యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రణభేరి ప్రచార జాతను బుధవారం మధ్యాహ్నం గజపతినగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలను అందజేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహన్రావు మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు బోధ నేతల పనులు రద్దుచేసి బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిలు కిషోర్ కుమార్, మురళీమోహన్,సీనియర్ నేత విజయ గౌరీ,శ్రీనివాసరావు భాస్కరరావు ఈశ్వర్ రావు రమేష్ పట్నాయక్ రాము తదితరులు పాల్గొన్నారు.