కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు
కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎల్ నరసింహులు పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు రావలసిన వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు తదితర అంశాలలో ప్రభుత్వాలు కార్మికులకు అన్యాయం చేస్తున్నాయన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్మికుల సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.