హిమాయత్ నగర్: షేక్ పేట డివిజన్లోని డైమండ్ హిల్స్ ప్రాంతంలో 66, 67 బూతుల వద్ద అవకతవకలు జరిగాయి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
షేక్‌పేట డివిజన్లోని డైమండ్ హిల్స్ ప్రాంతంలో ఆల్ పలహ స్కూల్ వద్ద 66, 67 బూతుల వద్ద అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఎన్నికల అధికారులు కాంగ్రెస్‌కు కొమ్ము కాస్తున్నారని బోగస్ ఓట్లు వేస్తున్న పట్టించుకోవడంలేదని శ్రవణ్ తెలిపారు. ఈ మాత్రం దానికి ఎలక్షన్లో ఎందుకని కాంగ్రెస్ గెలిచిందని డిక్లర్ చేయండి అని మండిపడ్డారు. బూతు ఏజెంట్లను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు.