కడప జిల్లా కమలాపురం పట్టణంలో ఆదివారం వైసీపీ రాష్ట్ర ఎస్ ఇ సి సభ్యుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం కేసులో రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ అసమర్ధకు నిదర్శనమన్నారు.16 నెలలుగా అధికార పార్టీ నాయకులు కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్న విషయాన్ని వైసీపీ నాయకులు బయట పెట్టి ఎక్సైజ్ పోలీసుల ద్వారా దాడి చేపిస్తే కల్తీ మద్యాన్ని పట్టుకున్న పోలీసు ఆఫీసర్ ను తక్షణమే బదిలీ చేయడం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కాదా అని ఆయన ప్రశ్నించారు.