గద్వాల్: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రోటోకాల్ రగడ
గద్వాల కలెక్టరేట్లో జరిగిన ప్రజా పాలన దినోత్సవంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది.కార్యక్రమ వేదికపైకి గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్‌ను ఆహ్వానించి జిల్లా లైబ్రరీ ఛైర్మన్, అలంపూర్ మార్కెట్ యార్డ్ ఛైర్మన్లను పిలవకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపైకి వెళ్లిన వారిని పోలీసులు కిందికి తీసుకువచ్చారు.అయితే, ఉన్నతాధికారుల ఆదేశాలతో వారిని తిరిగి వేదికపై కూర్చోబెట్టడంతో వివాదం సద్దుమణిగింది.