కొత్తగూడెం: పాల్వంచ ఇందిరాకాలనీ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని,ద్విచక్ర వాహనం ఢీ,ఇద్దరికీ గాయాలు,ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కు గాయాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్ లో బుధవారం మధ్యాహ్నం సమయంలో చోటుచేసుకుంది... స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని ఇందిరా కాలనీ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాండంగాపురం ప్రాంతానికి చెందిన సురాజ్ అనే వ్యక్తిని, ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన రాములు, మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ సురాజ్ ని ఢీకొన్నారు.. ఇద్దరికీ గాయాలు కావటంతో స్థానికులు 108 వాహనంలో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది