పలమనేరు: ఆర్.ఎం.పి వైద్యుడు రుబాబు, డబ్బులు ఇవ్వకపోతే సామాన్లు బయటపడేస్తా అంటూ మీడియాపై బూతు పురాణం
పలమనేరు: పట్టణం సామాజిక మాధ్యమాల్ల ఆర్.ఎం.పి డాక్టర్ వాసుదేవన్ నిర్వాకం వైరల్ అయింది. తన సమీప వైద్యుడు పక్షవాతంతో బాధపడుతున్న కోదండ నాయుడు క్లినిక్ వెళ్లి డబ్బులు ఇవ్వకపోతే సామాన్లన్నీ బయటపడేస్తాను నా కథ మీకు తెలీదు మీరు ఎవరికైనా చెప్పుకోండి అంటూ తీవ్రమైన పదజాలంతో దుర్భసలాడారు. అంతేకాకుండా యూట్యూబ్ జర్నలిస్టులను అవమానకరమైన భాషతో ఎవరొచ్చినా వారిని తంతాను అంటూ అత్యంత దారుణంగా బూతులు మాట్లాడారు. ఈ ఘటనపై యూట్యూబ్ జర్నలిస్టులు ఫోన్ చేసి వివరణ కోరగా, నేను మిమ్మల్ని అనలేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనపై యూట్యూబ్ జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.