కనిగిరి: అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ.... అధికారులు బాధ్యతతో పనిచేసి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి అధికారులు పక్కాగా ప్రణాళికతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. ఇంకా అవసరమైన అభివృద్ధి పనులను తన దృష్టికి తీసుకువస్తే, ప్రభుత్వం నుండి నిధులు రాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుద్దామని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.