ప్రకాశం జిల్లా మద్దిపాడులోని బీసీ, ఎస్సీ బాలుర హాస్టళ్లను బుధవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న మెనూ పరిశీలించి అనంతరం విద్యార్థులను అడిగి మరిన్ని వివరాలను తెలుసుకున్నారు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజన వసతి జరుగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని పట్టుకులర్ గా పరిశీలన చేశారు హాస్టల్ పరిసరాలను పరిశీలన చేసి సరైనటువంటి శుభ్రత మరియు పరిశుభ్రతలను పాటిస్తున్నారా లేదా అనేది అడిగి తెలుసుకున్నారు. హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.