అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీమంత్రి
ప్రజల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ సమైక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కి దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చాలని డిమాండ్ చేశారు.