సిరిసిల్ల: ద్విచక్ర వాహనాలపై త్రిపుల్ రైడింగ్ చేసిన యువతకు పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం: CI కే. కృష్ణ
సిరిసిల్ల పట్టణంలో ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేసిన యువకులక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టింది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పట్టణ సిఐ కే. కృష్ణ ఆధ్వర్యంలో జల్సాలకు అలవాటు పడి వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేసిన యువతకు అవగాహన కల్పించారు. యువత త్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే ప్రతి వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాలని హెల్మెట్ ధరించాలని సూచించారు. పట్టణంలో ఎవరు కూడా త్రిబుల్ రైడింగ్ చేయవద్దని వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సిఐ కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చట్టపరంగా చర్యలు