యాడికి మండల వ్యాప్తంగా ఈనెల 21, 22, 23 తేదీల్లో మూడు రోజులు పాటు నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని తహశీల్దార్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ సుమంత్ రెడ్డి కోరారు. యాడికి లోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయాలన్నారు. కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.