రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ' రైతన్నా - మీకోసం ' కార్యక్రమంలో భాగంగా బుధవారం మద్దిపాడు మండలం దొడ్డవరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట ఉత్పత్తులకు అవసరమైన గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు సాగులో నూతన పరిజ్ఞానాన్ని రైతులకు ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. వినూత్న విధానాలతో రాబడి పెంచుకునేలా రైతులు కూడా ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు