పమిడిముక్కలలో విద్యుత్ షాక్తో నాలుగేళ్ల బాలుడు మృతి
Machilipatnam South, Krishna | Sep 17, 2025
పమిడిముక్కలలో విద్యుత్ షాక్తో నాలుగేళ్ల బాలుడు మృతి స్తానిక పమిడిముక్కల మండలం తాడంకిలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో విషాదంచోటు చేసుకుంది. ఇంటి పక్కన ఉన్న రైస్ మిల్లుదగ్గర ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు యడ్లపల్లి తిరుపతయ్య ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. రైస్ మిల్లు వద్ద విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉండటమే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. బాలుడి వద్దకుంటుంబ సభ్యులు బోరును విలపిస్తున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి.