ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలోని మన్నేరు వాగులో గురువారం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. హైదరాబాదులో భవన నిర్మాణ కార్మికుడిగా పనులు చేసుకుంటున్న వెంకటేశ్వర్లు నిన్న సొంత బాబాయ్ చనిపోవడంతో అతని అంతక్రియలలో పాల్గొనేందుకు శానంపూడి కి వచ్చాడు. గల్లంతైన వెంకటేశ్వర్లు మృతదేహాన్ని బంధువులు కుటుంబ సభ్యులు అధికారులు గాలిస్తున్నారు.