బాల్కొండ: భీంగల్ లో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి యూరియా కొరత లేదనడంతో గ్రామంలో రైతులు, మహిళల ఆందోళన
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలం పల్లికొండ గ్రామంలో వందలాది మంది గిరిజన, మహిళా రైతులు తరలివచ్చారు. తాళ్లపల్లి, దేవక్కపేట్, రంగారాయి, కారేపల్లి, రహత్ నగర్ల నుండి వచ్చిన రైతులు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో యూరియా కొరత లేదని, ముత్యాల సునీల్ రెడ్డి రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని రైతులు ఆరోపించారు. వేముల ప్రశాంత్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని వారు స్పష్టం చేశారు