అనంతపురం జిల్లాలోని జీడిపల్లి వద్ద మహారాష్ట్రలోని రాయఘడ్ కు చెందిన బాలిక అనుమానాస్పద మృతి
Anantapur Urban, Anantapur | Sep 17, 2025
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని వెలుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ సమీపంలో మహారాష్ట్ర లోని రాయఘడ్ కు చెందిన 8 సంవత్సరాల కాజోల్ అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె అనారోగ్యంతో మృతి చెందిందా లేక ఇతర కారణం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.