నారాయణ్‌ఖేడ్: మెదక్ లో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలి: నారాయణఖేడ్ లో citu ఏరియా కమిటీ కార్యదర్శి రమేష్
డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్‌లో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నారాయణఖేడ్ ఏరియా కార్యదర్శి రమేష్ శుక్రవారం పిలుపునిచ్చారు. సీఐటీయూ కార్మికుల పక్షాన ఉండి నిరంతరం కోట్లాడే సంఘం అని అన్నారు. కార్మికులు వేలాది సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని ఆయన పేర్కొన్నారు.