అసిఫాబాద్: విశ్వకర్మ ఆదర్శప్రాయుడు: ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్
వాస్తు శిల్పులకు విశ్వకర్మ ఆదర్శప్రాయుడని ASF కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ASF జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో బుధవారం నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకలకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ ఆర్కిటెక్చర్ అభివృద్ధి చెందని సమయంలో గొప్ప నైపుణ్యంతో ఎన్నో రాజభవనాలు నిర్మించారని కొనియాడారు. విశ్వకర్మ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.