భిక్కనూర్: కాచాపూర్ లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర రెండవ మహాసభల వాల్ పోస్టర్లు ఆవిష్కరణ
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాజాపూర్ గ్రామంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రెండవ రాష్ట్ర మహాసభల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు మాట్లాడుతూ. అక్టోబర్ 11 12 వ తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర రెండవ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మహాసభలలో బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ మహాసభలోకి ముఖ్య అతిథిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క హాజరుతున్నట్లు తెలిపారు.