భీమిలి: అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ప్రారంభించిన స్వస్థ్ నారీ శక్తి పరివార్ అభియాన్ వైద్య పరీక్షలు
వాంబే కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నిర్వహించిన స్వస్థ్ నారీ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగముగా 7వార్డు టీడీపీ వార్డు సెక్రటరీ కానూరి అచ్యుత్ మరియు కూటమి నాయకులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు, పిల్లలు వైద్య నిపుణులు మరియు మెడికల్ ఆఫీసర్ డా,, మోహన్ కృష్ణ మండ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ యూ నోటి, రొమ్ము, గర్భాశయం పరీక్షలు, ఇమ్యూన్జేషన్ సేవలు, క్షయ (టీబీ ) పరీక్షలు, సికల్ సెల్ అనీమియా నిర్వహించారు.