ఆత్మకూరు: తమ బాధను మంత్రి ఆనంకు వివరించిన ఓ పేద విద్యార్థి, అన్ని ఖర్చులను నేనే భరిస్తానంటూ మంత్రి హామీ
సమాజంలో వెనుకబడిన, రోడ్డు ప్రమాదంలో తన కాలు కోల్పోయి బాధపడుతున్న ఓ పేద విద్యార్థికి అండగా నిలిచి, మానవత్వానికి ప్రతీకగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిలిచారు. ఆత్మకూరులోని బీసీ గురుకుల పాఠశాల పర్యవేక్షణ సందర్భంగా, రోడ్డు ప్రమాదంలో తన కాలు కోల్పోయి ప్రస్తుతం స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మొదట సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి తన ఆవేదనను మంత్రి ఆనంకు వివరించాడు. ఆ విద్యార్థి పరిస్థితి చూసి చలించిపోయిన మంత్రి ఆనం, తక్షణమే తన సొంత ఖర్చుతో ఆ విద్యార్థికి ఆర్టిఫిషియల్ కాలు ఏర్పాటు చేయిస్తానని, అలాగే అయ్యే అన్ని ఖర్చులను తానే భరిస్తాననీ భరోసా ఇచ్చారు. మంత్రి ఆనం