సూళ్లూరుపేటలో భారీ వర్షం
- నీటిమయమైన ప్రధాన వీధులు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. దీంతో బుధవారం ఉదయం నాటికి రహదారులు, ప్రధాన వీధులు నీట మునిగాయి. భారీ వర్షం కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం కురవడంతో పంట పొలాలు నీటమునిగాయి. మరో 24 గంటలు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.