బాపట్ల జిల్లాలో పంట వేసిన ప్రతి రైతుకు యూరియా పంపిణీ చేస్తాం: బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
బాపట్ల జిల్లాలో పంటలు వేసిన ప్రతి రైతుకు యూరియా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. రైతు సేవ కేంద్రాల వివరాలను ముందుగానే రైతులకు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 27 కేంద్రాల ద్వారా యూరియాను 4236 మంది రైతులకు పంపిణీ చేశామని, ఇంకా 60 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.