అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి కొత్తపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రైతన్న నీకోసం కార్యక్రమంలో కంది చీని పంటను వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ పథకం తీసుకురావడం జరిగిందని 20వేల రూపాయలను నేరుగా రైతు ఖాతాలోకే జమ చేస్తున్నామన్నారు అదేవిధంగా రైతుల పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.