గజపతినగరం: ఆరోగ్యవంతమైన మహిళతోనే ఆరోగ్యకర కుటుంబం: మధుపాడ లో పీఎం పాలెం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ సతీష్
గంట్యాడ మండలం మధుపాడ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం స్వస్థనారి స్వసక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ సర్పంచ్ తో పాటు పెద్దలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెదమజ్జిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ మాట్లాడుతూ, ఆరోగ్యంవంతమైన మహిళలతోనే ఆరోగ్యకరమైన కుటుంబం సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఈవో రాజ్, వైద్య సిబ్బంది తిరుపతి, ఈశ్వరరావు,రవి, ఏఎన్ఎంలు, ఎం ఎల్ హెచ్ పీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు