మచిలీపట్నం లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహణ
Machilipatnam South, Krishna | Sep 16, 2025
మచిలీపట్నం లో కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కేవీ. రామకృష్ణయ్య మంగళవారం మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ యోగ సభ, కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతూ, ప్రతి పౌరుడు చట్టాల పట్ల కనీస అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది లంకిశెట్టి బాలాజీ కూడా పాల్గొన్నారు.