ఏమైనా సమస్యలు ఉంటే బజారులో మాట్లాడకుండా తన దృష్టికి తీసుకు రావాలని కావలి MLA కావ్యా కృష్ణారెడ్డి సూచించారు. 'సమస్యలు ఉంటే నాయకులు వారధిగా ఉండి నా దగ్గరకు తీసుకు రావాలి. మధ్యవర్తుల దగ్గర మాట్లాడితే సమస్యలు పెరగడం తప్ప తగ్గవు. కావలిలో 24 గంటలూ నేను అందుబాటులో ఉంటా. చంద్రబాబు ప్రతినిధిగా కావలిలో అన్ని నేనే చూసుకుంటా. కావలి నియోజవర్గంలో నేను కాకుండా ఇంకో రూల్ ఉండదు' అని సున్నితంగా MLA హెచ్చరించారు.