అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గురువారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తోపుదుర్తి గ్రామంలో నిన్నటి రోజున ఎమ్మెల్యే పరిటాల సునీత తాను మంజూరు చేయించిన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించి తనపైనే విమర్శలు చేయడం జరిగిందన్నారు మంత్రిగా ఉన్న పరిటాల సునీత ఎక్కడే గాని నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేదని ఇప్పుడు తాను తెచ్చిన విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించి తన పైన విమర్శలు చేస్తున్నారని పరిటాల సునీత పై మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శించారు.